1.ఫసలి = జూలై 1వ తేదీ నుండి జూన్‌ 30వ తేదీ వరకు ఉన్న కాలం లేదా రెవెన్యూ సంవత్సరం
2. ఆర్‌.ఎస్‌.ఆర్‌. = రీసెటిల్‌మెంట్‌ రిజిష్టర్‌ లేదా శాశ్వత ఎ- రిజిష్టరు
3. డైగ్లాటు = ఇంగ్లీషు, తెలుగు భాషలో అచ్చు వేసిన శాశ్వత ఎ రిజిష్టరు
4. ఫెయిర్‌ అడంగల్‌ = ఎస్టేటు గ్రామములకు చేతితో రాసిన శాశ్వత ఎ`రిజిష్టరు
5. అడంగల్‌/ పహాణి = గ్రామ లెక్క నెం. 3
6. ఫసిలీ జాస్తి = రిజిస్టరు పల్లం భూమిలో ఆరు నెలలకు మించి నీరు తీసుకుని పండిరచే చెరకు, అరటి, పసుపు/ తమ పాకులు పంటకు విధించే అధిక ఛార్జి.
7. తీర్వాయిజాస్తి = మెర్క భూములలో సర్కారు జలాధారం నుండి నీటిని పెట్టుకున్నందుకు విధించే నీటిఛార్జీ
8. శివాయ జమసాగు = పట్టా పొందని ఆక్రమణ భూమి సాగు చేయుట.
9. బంజరు = బీడు భూమి
10. రెమిషన్‌ = అతివృష్టి, అనావృష్టి వల్ల పంట నష్టానికి గురైతే ప్రభుత్వం ఇచ్చే పన్ను మినహాయింపు.

Leave a Reply

Your email address will not be published.