• గిరాని అలవెన్సు
    డి.ఎ.
  • హజరీ వసూలు
    ఎల్‌.పి.సి.
  • బరాపర్ట్‌
    పే బిల్లు
  • రోజ్‌నాంచా
    డైరీ (దినచర్య)
  • రూద్‌ఘాట్‌
    బల్లకట్టు
  • అతిష్‌ జదిగి
    అగ్ని ప్రమాదం
  • ఛార్‌మాహీ
    రెండో పంట క్షేత్ర తనిఖీ
  • హస్తుమహీ
    మొదటి పంట క్షేత్ర తనిఖీ
  • ఖిస్తు బందీ
    భూమి శిస్తు జమచేయవలసిన కాలము
  • తైబందీ
    ఆయకట్ట సాగు స్థిరీకరణ
  • ముంతజీమ్‌
    ఆఫీస్‌ సూపరింటిండెంట్‌
  • గిర్దావారు
    రెవిన్యూ ఇన్‌స్పెక్టర్‌
  • నాయబ్‌ తహసిల్‌దార్‌
    డిప్యూటీ తహసీల్‌దార్‌
  • రుజువత్‌
    సర్వే వైశాల్యాన్ని టిప్పన్‌, పక్కా ఉతార పుస్తకాలతో సరిపోల్చి తయారుచేసేతనిఖీ నివేదిక
  • మాజీ నెంబర్‌
    పాత సర్వే నెంబరు
  • ఖాల్సేతర ప్రాంతం
    జాగీర్ధార్‌ గ్రామం
  • దువ్వం తాలూకాదార్‌
    ఆర్‌.డి.ఓ.
  • ఖాల్సె విలేజ్‌
    ప్రభుత్వ గ్రామం
  • అవ్వల్‌ తాలూకాదార్‌
    కలెక్టర్‌
  • నాజీం
    సంచాలకుడు
  • ధారా బందీ
    శిస్తు
  • గూటం గుర్తు
    బయటి హద్దులు
  • బందోబస్తు రిజిష్టర్‌
    ఆర్‌.ఎస్‌.ఆర్‌.
  • అనుబంధ సేత్వార్‌
    బదిలీ మార్పులు లేదా కొత్త విభాగాలు నమోదు చేసే రిజిష్టరు
  • టేంచ్‌ఫ్లాట్‌
    కొత్త ఉప విభాగాలను కొలిచి స్థలాలను స్కేలుకు చూపే రేఖా పటం
  • ఖారిజ్‌ ఖాతా
    పట్టెదారు వదలివేసిన భూమి
  • పరత్‌ బుక్కు
    ప్రభుత్వ పోరంబోకు భూములను తెలిపే రిజిష్టర్‌
  • ధర్‌
    తరం వర్గీకరణ లేదా తరం రేటు
  • చౌఫస్లా
    చిట్టీ లేదా ప్రతి ఖాతాలో వర్గీకరణ, విస్తీర్ణం, పట్టాదారు పేరు నమోదు చేసే రిజిష్టర్‌ లేదా పట్టాదారు భూముల పూర్తి వివరాలు తెలిపే రిజిష్టర్‌
  • కమ్మి జాస్తి పత్రిక్‌ (కె.జి.పి.)
    స‌ర్వేనెంబరు వివరాలు,కొత్త విభాగాలతో 19కాలమ్‌ల ప్రోఫార్మా రిజిష్టర్‌
  • కాయంటోక్‌
    జి.రేఖకై ఏర్పాటయ్యే కొత్త బిందువు
  • పొడి రిజిష్టర్‌
    ల్యాండ్‌ దరఖాస్తు రిజిష్టర్‌ లేదా అసైన్‌మెంట్‌ రిజిష్టర్‌
  • గట్‌ నెంబర్‌
    బంజరు భూములు
  • పోడి పని
    మార్పుల వల్ల ఏర్పడే ఉప విభాగం
  • పోట్‌ నంబర్‌
    సర్వే గుమస్తా
  • దఫ్తర్‌ బంద్‌
    రికార్డు గుమస్తా
  • టిప్పన్‌ పుస్తకం
    కొలత రికార్డు లేదా రఫ్‌ స్కెచ్‌, ఎఫ్‌.ఎం.బి.
  • ఛాలెపథర్‌
    క్షేత్ర త్రిసంగమ స్థానాల దగ్గర దిశలను చూపించే సర్వే నరాళ్ళు
  • షికమ్‌
    ముంపు ప్రభుత్వ భూములు
  • బంజరు
    ప్రభుత్వ భూమి
  • మాజీ నంబర్‌ జడ్తి
    తాజా రెవిన్యూ పద్దుల ప్రకారం సర్వే నెంబర్‌వారీ పట్వారీ తయారుచేసే వివరణ పుస్తకం
  • సర్‌నక్‌షా
    గ్రామ స్థాయి మాన చిత్రం
  • వస్లాలు
    సగం రూండీ
  • లాంబీ
    ఆధార రేఖ
  • నాలా
    కలవ, బోదె
  • పక్క పుస్తకం
    క్షేత్ర వైశాల్యం గణించి ఎడమవైపు పుటలో నమోదు చేసే పుస్తకం
  • సేత్వార్‌
    రీసెటిల్‌మెంట్‌ రిజిష్టర్‌ లేదా డిగ్లట్‌ రిజిష్టర్‌
  • జంత్రీ
    సెడిరడ్‌ స్కేల్‌
  • నతీ జమాలి
    మాగాణీ,తోట, మెట్ట భూములకు పూర్వపు విస్తీర్ణం,ధార బందీలను తెలిపే స్టేట్‌మెంట్‌
  • జరియావారి
    నీటి వనరుల కింద ఉన్న విస్తీర్ణపు వివరాలను తెలిపే రిజిష్టర్‌
  • అలిఫ్‌ నమూనా
    జమాబందీ విభాగము తయారుచేసే ’ఎ‘ స్టేట్‌మెంట్‌
  • పక్కా నక్‌షా
    గ్రామ పటము
  • దర్వారీ రిజిష్టర్‌
    ఒకే మృత్తిగా వర్గ విలువ ఉన్న సర్వే నెంబర్ల భూముల విస్తీర్ణాన్ని ఒకదాని కింద ఒకటిగా ఒకే చోట నమోదుచేసే పుస్తకం
  • తిప్పన్‌ పుస్తకం
    క్షేత్ర సరిహద్దు రేఖలు, ఆధార రేఖ, అంతర్‌ లంబాల కొలతలు తెలిపే పుస్తకం (ఎఫ్‌.యం.బి.) లేదా క్షేత్ర స్థాయి కొలతలు స్కెచ్‌
  • ఛల్తా నెంబర్‌
    సర్వే పనిలో సర్వేయర్‌కు కేటాయించిన సర్వే విభాగం
  • ధెకె
    గ్రామ పనికై సర్వేయర్‌కు కేటాయించిన సర్వే విభాగం
  • ఠేకబందీ రిజిష్టర్‌
    గ్రామ సరిహద్దుల ప్రకారం సర్వే నెంబరు, వాటి విస్తీర్ణాలు తెలిపే పుస్తకం లేదా చిత్తు వసూలు బాకీ రిజిష్టర్‌
  • కరన్‌
    సమకోణ త్రిభుజ రేఖ
  • కాటకూన్‌
    ఆధారకు ఇరువైపులా గ్రామ సరిహద్దును కలుసుకునే వరకు గీసే రేఖ (సహాయ రేఖ)
  • ఆధార్‌
    ఆధార రేఖ
  • గైరాన్‌
    సామాజిక పోరంబోకు
  • గట్‌ భూములు
    బీడు భూములు
  • యెఖ్‌రార్‌ నామా
    ఇరు గ్రామాల పార్టీల నుంచి సర్వేయర్‌ తీసుకునే సరిహద్దు గ్రామాల ఒప్పందం
  • జమీందారులు లేదా దేవ్‌ ముఖ లేదా దేశపాండే
    ఉప కౌలుదార్లు
  • తాలుకాదార్‌ లేదా నాయబ్‌
    శిస్తు వసూలు అధికారి
  • సనద్‌
    ఉత్తర్వు లేదా ధృవ పత్రము
  • కౌలునామా
    ఒప్పంద పత్రం
  • క్లాసర్‌ రిజిష్టర్‌
    సర్వే నెంబర్‌ వారీ గ్రామంలో అన్ని భూముల వివరాలు తెలిపే రిజిష్టర్‌
  • తక్ధా దెహసాల్‌
    10 సంవత్సరాల సాగు వివరణలు
  • నక్షా
    విలేజ్‌ మ్యాప్‌ (గ్రామ స్థాయి మ్యాప్‌)
  • ఉదార పుస్తకం
    ఒక్కో సర్వే నెంబర్‌ విస్తీర్ణం లెక్కించి రాసే రిజిష్టర్‌
  • క్లాసర్‌ ఆకర్‌
    విరామ కృషి
  • భగణా
    అణా వారీ (సగటు విలువ)
  • పహాణి ప్లాట్‌
    సర్వేయర్‌ తయార్‌ చేసే మోజిని ఫ్లాట్‌ (డి.స్కెచ్‌)
  • పానీ క్లాస్‌
    జల వర్గీకరణ లేదా నీటి తరగతి
  • పోట్‌ ఖారాబ్‌
    వ్యవసాయయోగ్యత లేని భూమి
  • మైల్‌ వార్‌
    రాయితీ
  • అనవారీ
    అణాల రూపంలోని మృత్తిగ సగటు విలువ
  • ఖాస్తాలు
    విభాగాలు (సర్వే క్షేత్ర విభాగం)
  • దరి భూమి
    మాగాణి, భాగత్‌ భూముల్లోని మొదటి తరగతి
  • పని భూమి
    మాగాణి, భాగత్‌ భూముల్లోని మొదటి తరగతి
  • బాగాత్‌ భూమి
    తోట భూములు
  • మాగాణి భూమి
    పల్లం భూమి
  • ప్రధి రిజిష్టర్‌
    భూమి వర్గీకరణ వివరాలు నమోదు చేసే పుస్తకం
  • మెకా మోయినా
    స్పాట్‌ ఇన్‌స్పెక్షన్‌
  • షామిల్‌ నెంబర్‌
    నెంబర్‌ కలుపుట
  • చల్కా భూములు
    మెట్ట భూములు
  • ధారా బందీ
    నీటి తీరువా
  • ఎర్ర చల్క
    ఎర్ర రేగడి భూమి
  • నల్ల చల్క
    నల్లరేగడి భూమి
  • మింజుమిలె
    మొత్తం
  • తాబీ పంట
    రెండో పంట, రబీ
  • అబీ పంట
    మొదటి పంట, ఖరీఫ్‌
  • వసూల్‌ బాకీ రిజిష్టర్‌
    పట్టా వారి శిస్తు చెల్లింపు జాబితా
  • ఫైనల్‌ పట్టీ
    బదిలీ రిజిష్టర్‌
  • పడావ
    బీడు
  • కబ్జా
    ఆక్రమణ
  • దపుర
    క్యాంపు
  • కారుగూ జారీ
    చేసినవి
  • సేతుసిందీ/ కావలికారు
    గ్రామ నౌకరు /ఇన్‌స్పెక్టర్‌
  • పోలీసు పటేల్‌
    మున్సబు
  • పట్వారీ
    కరణం
  • రఖ్ఖం
    శిస్తు
  • పహాణీ
    అడంగల్‌
  • బాపతు పల్లం
    పుంజ భూమి నంజగా మార్జినది
  • ఖాయపు పల్లం
    గ్రామ లెక్కలలో పల్లంగా చేర్చి శిస్తు కట్టే పల్లంగా ఖాయం చేసిన భూములు
  • మామూలు పల్లం
    ఒక జలాధారం ఏర్పాటుకు ముందే పల్లంగా సాగయ్యే భూమి
  • బాకీ
    ఫసలీకి చివర ఇవ్వాల్సిన సొమ్ము
  • దస్తు వసూలు
    గ్రామ చావడి లేదా కూడలిలో శిస్తు వసూలు చేయడం
  • ముదరా
    రాయితీ
  • బేరీజు మినహాలు
    వసూలులో నుంచి మత లేదా ధర్మ సంబంధ కార్యాలకు తహశీల్దార్‌ ఆర్డర్‌పై బట్వాడా చేయగా ఇచ్చే మినహాలు
  • నదార్తు
    ఏమీ లేదు
  • ఇర్సాలు
    వసూలు చేసిన శిస్తు లేదా సొమ్మును ట్రెజరీలో జమ చేయడం.
  • జిరాయితీ
    రైత్వారీ భూమి
  • గ్రామ నత్తము
    గ్రామ కంఠం
  • ఫాజలు
    చెల్లించాల్సిన దాని కన్నా ఎక్కువ చెల్లించ‌డం
  • ఆధీనము
    హక్కు లేదా స్వాధీనం
  • అనాదీనము
    పూర్వం నుంచి
  • అడ్జస్ట్‌మెంట్‌
    సర్దుబాటు
  • అజమాయిషీ
    సరిగా ఉన్నదీ లేనిదీ తనిఖీ చేయుట
  • బందోబస్తు
    కట్టుదిట్టము లేదా జాగ్రత్త చేయుట
  • బకీరు
    ప్రాథమిక నివేదిక లేదా ఎఫ్‌.ఐ.ఆర్‌.
  • కాటకము
    కరువు
  • గుడి కట్టు
    గ్రామ హద్దులలో ఉండే మొత్తం భూమి
  • పెరటి సాగు
    గ్రామ కంఠంలో ఇంటికి చేరవలో ఉన్న స్థలంలో చేసే సాగు
  • రాళ్ళ డిపో
    సర్వే రాళ్ళు నిల్వచేసే చోటు
  • రెండు భోగము
    రెండో సాగు పంట
  • మొదటి భోగము
    మొదటి సాగు పంట
  • బేవార్సు
    ఒక సొత్తుకు హక్కుదారు ఎవరో తెలియకపోతే ఆ సొత్తు బేవార్సు ఆస్తి
  • బకాయి
    గత ఫసలీల బాకీ
  • ప్రొవిజినల్‌ డిమాండ్‌
    ఉజ్జాయింపు డిమాండ్‌
  • శిస్తు కట్టని గయాళు
    శిస్తు నిర్ణయించని ఖాళీ భూమి
  • శిస్తు కట్టిన గయాళు
    పట్టా ఇచ్చేందుకు ఉద్దేశింపబడి శిస్తు నిర్ణయించిన ఖాళీ భూమి
  • అచ్చు కట్టు
    మెరక భూమిలో గట్లు వేసి నీరు నిల్వ చేసి వరి సాగు చేయ‌డం.
  • నంజ లేదా తరి
    పల్లం భూమి
  • పుంజ లేదా ఖుష్కి
    మెరక భూమి
  • పోతీ లెక్క
    పట్టాదారులు ఎవరైనా చనిపోతే హక్కుదారునిగా వారసుని పేరు గ్రామ లెక్కలలో చేర్చేందుకు గ్రామ రెవెన్యూ అధికారి పంపే లెక్క
  • సెస్సులు
    భూమి శిస్తుపై అదనంగా వసూలు చేసే ప్రత్యేక రుసుం(విద్యా సెస్సు, పంచాయితీ సెస్సు లాంటివి)
  • కిస్తీ
    భూమి శిస్తు చెల్లింపు కోసం ప్రభుత్వం నిర్ణయించే వాయిదాలు (జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలు)
  • బి.మెమో
    సర్కారు భూముల ఆక్రమణదారుల నుంచి శిస్తు, పెనాల్టీ వసూలు కోసం జారీ చేసే నమూనా
  • పోరంబోకు
    ప్రజోపయోగం నిమిత్తం ప్రభుత్వ భూమి
  • గయాళు
    పట్టా ఇవ్వదగిన భూమి
  • జమాబందీ
    గ్రామ లెక్కల తనిఖీ లేదా ఆడిట్‌
  • దాళ్వా లేదా తాబీ
    రెండో దఫా పండించే వరి
  • సార్వా
    మొదటి దఫా పండించే వరి
  • రబీ
    అక్టోబర్ - డిసెంబర్‌ మధ్య విత్తే పంటలు
  • ఖరీఫ్‌ లేదా పునాస
    జూలై - సెప్టెంబర్‌ల మధ్య విత్తే పంటలు
  • సాలుగు జస్తా
    గడచిన ఫసలీ
  • హాలు సాలు
    ప్ర‌స్తుత‌ ఫసలీ
  • రెమిషన్‌
    అతివృష్టి, అనావృష్టి వల్ల పంట నష్టానికి గురైతే ప్రభుత్వం ఇచ్చే పన్ను మినహాయింపు.
  • బంజరు భూమి
    బీడు భూమి
  • శివాయ జమసాగు
    పట్టా పొందని ఆక్రమణ భూమి సాగు చేయ‌డం.
  • తీర్వాయి జాస్తి
    మొర్క భూములలో సర్కారు జలాధారం నుండి నీటిని పెట్టుకున్నందుకు విధించే నీటి ఛార్జీ
  • ఫసిలీ జాస్తి
    రిజిస్ట‌రు పల్లం భూమిలో ఆరు నెలలకు మించి నీరు తీసుకుని పండించే చెరకు, అరటి, పసుపు, తమల‌ పాకుల పంటకు విధించే అధిక ఛార్జి.
  • ఫెయిర్‌ అడంగల్‌
    ఎస్టేటు గ్రామాల‌కు చేతితో రాసిన శాశ్వత ఏ - రిజిష్టరు
  • డైగ్లాటు
    ఇంగ్లీషు, తెలుగు భాషలో అచ్చు వేసిన శాశ్వత ఏ - రిజిష్టరు
  • ఆర్ఎస్ఆర్
    రీసెటిల్‌మెంట్‌ రిజిష్టరు లేదా శాశ్వత ఎ - రిజిష్టరు
  • ఫసలి
    జూలై 1వ తేదీ నుండి జూన్‌ 30వ తేదీ వరకు ఉన్న కాలం లేదా రెవెన్యూ సంవత్సరం
  • Dictionary Word
    This is the test defining the word and evry details regarding words.
  • రెవెన్యూ పదాలు- అర్థాలు
    1.ఫసలి = జూలై 1వ తేదీ నుండి జూన్‌ 30వ తేదీ వరకు ఉన్న కాలం లేదా రెవెన్యూ సంవత్సరం 2. ఆర్‌.ఎస్‌.ఆర్‌. = రీసెటిల్‌మెంట్‌ రిజిష్టర్‌ లేదా శాశ్వత ఎ- రిజిష్టరు 3. డైగ్లాటు = ఇంగ్లీషు, తెలుగు భాషలో అచ్చు వేసిన శాశ్వత ఎ రిజిష్టరు 4. ఫెయిర్‌ అడంగల్‌ = ఎస్టేటు గ్రామములకు చేతితో రాసిన శాశ్వత ఎ`రిజిష్టరు 5. అడంగల్‌/ పహాణి = గ్రామ లెక్క నెం. 3 6. ఫసిలీ జాస్తి = రిజిస్టరు పల్లం భూమిలో ఆరు నెలలకు మించి నీరు తీసుకుని పండిరచే చెరకు, అరటి, పసుపు/ తమ పాకులు పంటకు విధించే అధిక ఛార్జి. 7. తీర్వాయిజాస్తి = మెర్క భూములలో సర్కారు జలాధారం నుండి నీటిని పెట్టుకున్నందుకు విధించే నీటిఛార్జీ 8. శివాయ జమసాగు = పట్టా పొందని ఆక్రమణ భూమి సాగు చేయుట. 9. బంజరు = బీడు భూమి 10. రెమిషన్‌ = అతివృష్టి, అనావృష్టి వల్ల పంట నష్టానికి గురైతే ప్రభుత్వం ఇచ్చే పన్ను మినహాయింపు.
  • Land Laws
    gvgugu gugutff yxtzrxkl ojhygyf ytygi hiu
  • land revenue
    hnhfvjhvjhvhgfg gjhgjhgjh gjhgjhb